కోట శ్రీనివాసరావు..1978లో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేశారు. దాదాపు 750 చిత్రాల్లో నటించి, తొమ్మిది ఉత్తమ నటుడు అవార్డు లను కూడా సొంతం చేసుకున్నాడు. దగ్గుపాటి రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా ద్వారా ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును కూడా పొందాడు. ఇక 2015 సంవత్సరంలో ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు కూడా లభించింది.