తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'.అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది.ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.