తారకరత్న మాత్రం సినిమాలలో అంతగా రాణించలేక పోతున్నాడు. ఒకానొక సమయంలో ఆయన 10 సినిమాలను మొదలుపెట్టాడు. కానీ మొదటి రెండు సినిమాలు విడుదల అయ్యాక, ఆయనతో సినిమాలు చేయాలనుకున్న డైరెక్టర్లు మొత్తం డ్రాప్ అయ్యారు. దీనికి గల కారణం ఆయనను హీరోగా జనాలు ఆదరించక పోవడమే.. అందుచేతనే ఆయన సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పవచ్చు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన కొన్ని సినిమాల్లో నటించినా, అవి కూడా ఆయనను అలరించిలేకపోయాయి. ఇక మీదట ఆయన సినిమాల్లో కనిపించే అవకాశం కనబడలేదు.