యంగ్ హీరో విశాల్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్భంగా విశాల్ ఆయనకు ఒక జ్ఞాపికను అందజేశారు. విశాల్ వెంకయ్య నాయుడుకు అందజేసిన ఫోటో ఫ్రేమ్ లో వెంకయ్య నాయుడు సంబంధించిన పలు ఫోటోలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని విశాల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెంకయ్యనాయుడు తో అనేక అంశాలపై చర్చించినట్టు తెలిపారు.