థైరాయిడ్ సమస్యతో విపరీతంగా బరువు పెరిగి పోయినట్టు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తెలిపింది. దానికితోడు హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఆ సమయంలో తన ముఖం పై మొటిమలు వచ్చాయని చెప్పింది. అది చూసి చాలా భయపడినట్టు వెంటనే హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలిపింది. అయితే హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేసుకోగా తనకు ఉన్న సమస్యలు బయటపడ్డాయని తెలిపింది. కానీ డాక్టర్ల సలహాలతో లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నట్టు తెలిపింది.