ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు కొనసాగుతుంది. సినిమా పెద్దదా చిన్నదా అని చూడకుండా ట్రైలర్, టీజర్ లు ఆకట్టుకునేలా ఉంటే సినిమా పై ఎన్నో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక అలాగే ఇటీవల వచ్చిన చిన్న సినిమా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు.