తాజా సమాచారం ప్రకారం టక్ జగదీశ్ సినిమా థియేటర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 30 వ తేదీన ఈ సినిమా ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారు అయినట్టు సమాచారం. అంతేకాకుండా దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.