అక్టోబర్ 2021 వరకు సినిమాలను ఓటిటిలో విడుదల చేయవద్దని..ఇటీవలే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది.కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు మాత్రం ఇవేం పట్టించుకోకుండా తాను నిర్మించిన 'నారప్ప' సినిమాను ఓటిటిలోనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక దీనిపై అటు ఇండ్రస్టీ తో పాటు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా దీనిపై సురేష్ బాబు స్వయంగా స్పందించారు..