విజయ్ సేతుపతి మాస్టర్ చెఫ్ అనే ఓ తమిళ టీవీ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. "జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను.నేను చదువుకునేటప్పుడు నా కాలేజీ రోజులో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా పనిచేశాను.కాలేజ్ అయిపోయాక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12:30 వరకు అక్కడే పనిచేసి.. అక్కడే భోజనం చేసేవాడిని" అని తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను పంచుకున్నాడు.