బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తాప్సి కేవలం నటి గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు చేసింది . అందులో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి గత ఏడాదితో పది సంవత్సరాలు ముగిసింది. నేను స్టార్ హీరోయిన్ ని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు .ఇప్పటివరకు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ఇప్పుడు నేను ఒక కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నాను. 'అవుట్ సైడ్' నుంచి ఆ వచ్చే ఆలోచనలు ఎప్పుడూ చాలా గొప్పగా ఉంటాయి. 'అవుట్ సైడర్స్ ఫిలిమ్స్' అనే పేరుమీద సినిమా నిర్మాణ ఏర్పాటు చేస్తున్నాను. అని చెప్పింది.