తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రముఖ సినిమాటో గ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓ సరికొత్త వెబ్ సిరీస్ ను పౌరాణిక నేపథ్యంలో రెడీ చేసినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుండగా కరోనా కారణంగా కాస్త గ్యాప్ దొరకడంతో తను కూడా ఈ అంశంపై దృష్టి పెట్టి కొత్త కోణంలో ఈ వెబ్ సిరీస్ ను డిజైన్ చేసుకున్నట్లు తెలిపారు.