టాలీవుడ్ లో అతి తక్కువ మంది హీరోలు విలన్ గా నటిస్తున్నారు. అలా అటు హీరోగా ఇటు విలన్ గా ప్రశంసలు అందుకుంటున్న నటుడు ఆది పినిశెట్టి. చాలా సినిమాల్లోనే ఆది పినిశెట్టి నటించినప్పటికీ తెలుగులో ఆయనకు సరైనోడు సినిమా తో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు దీటైన విలన్ గా నటించి అదరగొట్టాడు. ఆ తర్వాత ఆది కి విలన్ గా ఎన్నో ఆఫర్ లు వచ్చాయి. కానీ మళ్లీ ఏ సినిమాలోనూ విలన్ గా నటించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆది పినిశెట్టిని మరో సినిమాలో కూడా విలన్ గా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.