ఒక షాకింగ్ పోస్ట్ సిద్ధార్థ్ కంటపడింది. యవ్వన వయస్సులో చనిపోయిన నటీనటులు అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫోటోలతో పాటు సిద్ధార్థ్ ఫోటోను కూడా వాడుకుంది. ఇక ఈ వీడియో కి సంబంధించిన ఒక మీమ్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో పైన సిద్ధార్థ్ చనిపోయాడని ఉండగా.... కింద నేను చనిపోయాను నాకు తెలియకుండానే సినిమాలు చేస్తున్నాను అంటూ సిద్ధార్థ్ ఫోటో ఉంది.