తమిళ సినిమాలు తెలుగులో తెలుగు సినిమాలు తమిళ్ లో రీమేక్ చేయడం కామన్. సినిమా బాగుంటే అది ఏ భాషల్లో విడుదలైనా రీమేక్ చేయడానికి నిర్మాతలు హీరోలు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పుడు రీమేక్ సినిమాల ప్రభావం గతం కంటే కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సూపర్ హిట్ సినిమాలను వెంటపడి మరి రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. అయితే సినిమా లను రీమేక్ చేసినప్పుడు కొన్నిసార్లు ప్రేక్షకులను మెప్పించవచ్చు.. కొన్నిసార్లు నిరాశపరిచే వచ్చు. కానీ రీమేక్ చేసి ప్రేక్షకులను అలరించినప్పటికీ ఆ సినిమాలపై ట్రోల్స్ రావడమే ఇబ్బంది కలిగించే విషయం. ఇప్పుడు అలాంటి ట్రోల్స్ యే వెంకటేశ్ హీరోగా నటించిన నారప్ప పై కూడా వస్తున్నాయి.