బాలీవుడ్ భామ శిల్పాశెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజ్ కుంద్రా కు మరో షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో రాజ్ కుంద్రా పై నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్ జి పి ఎల్ సత్య యుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో సచిన్ జోషి కి సంబంధించిన కిలో బంగారాన్ని ఆయనకు అప్పగించాలని ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలకు గానూ మరో మూడు లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా గతంలో రాజ్ కుంద్రా అతని భార్య శిల్పాశెట్టి సత్య యుగ్ గోల్డ్ స్కీం తో తనను మోసం చేశారని సచిన్ జోషి ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఏడాది జనవరిలో భార్యాభర్తల పై కేసు నమోదు చేశాడు.