మరోసారి సైబరాబాద్ పోలీసులు తమ టాలెంట్ చూపించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నారప్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మొన్న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ డైలాగుల్లో ఒక్క విషయం చెబుతాను గుర్తుపెట్టుకో సిన్నప్పా డబ్బు ఉంటే దోచుకుంటారు..భూమి ఉంటే లాక్కుంటారు. కానీ చదువును ఎవరూ దోచుకోలేరు. అనే డైలాగ్ తెగ ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు కూడా ఈ డైలాగ్ ను వాడుతున్నారు. ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో సిన్నప్పా కరోనా ఇంకా ముగిసిపోలేదు మాస్క్ పెట్టుకో... అంటూ మీమ్ తయారు చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.