మనదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు హిందీ బిగ్ బాస్ 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన సెలబ్రిటీలకు ఎంతో ఆదరణ వస్తోంది. దాంతో వారు హౌస్ నుండి భయటకు వచ్చిన తరవాత టీవీ షోలలో సినిమాల్లో సందడి చేస్తున్నారు. ఇక ఎంతో ప్రజాదరణ పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా టీవీ లో అయితే గంటన్నర రెండు గంటలు ప్రసారమైన బిగ్ బాస్ షో ఇప్పుడు 24 గంటలు ప్రసారం కావడం అనేది చెప్పుకోదగ్గ విషయమే.