నితిన్ షాలిని వివాహం జరిగి ఈరోజుకి ఏడాది కావస్తున్న సందర్భంగా నితిన్ తమ ఫోటోలను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.  ఈ సందర్భంగా నితిత్ ....పెళ్లి రోజు శుభాకాంక్షలు. నా మిగిలిన జీవితం మొత్తం కూడా నీతోనే గడపాలని కోరుకుంటున్నాను. నా జీవితాన్ని ఇంత సులభంగా, ఇంత గొప్పగా మరియు ఇంత సంతోషంగా చేసినందుకు కృతజ్ఞతలు అంటూ షాలిని కి ముద్దు పెడుతున్న ఫోటోలను షేర్ చేశాడు. కాగా నితిన్ పోస్ట్ పై పై ఆయన భార్య షాలిని కూడా ప్రేమను చాటుతూ స్పందించింది. ఇప్పుడూ... ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు అద్భుతం అంటూ నితిన్ పై శాలిని ప్రేమ చూపించింది.