సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు అనే ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సీక్వెల్ లో అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు చైతూ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో నాగార్జున కి జోడిగా మరో హీరోయిన్ శ్రీయ ఫైనల్ అయినట్లు సమాచారం.