బాలీవుడ్ నిర్మాత రాజ్ కుంద్రా కేసులో రోజురోజుకు సంచలనాలు బయటికి వస్తున్నాయి. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు కేసులో అతడి కంపెనీకి చెందిన మరో నలుగురు నిర్మాతలపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా ఇదే కేసులో నటి గేహానా వశిష్ట్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. గెహానా వశిష్ట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్న్ వీడియోల కేసులోనే అరెస్టయ్యారు. ప్రస్తుతం గెహానా బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ బాలీవుడ్ నటి పై పోలీసులు నమోదు చేయడం సంచలనం గా మారింది. ఇది ఇలా ఉండగా రాజ్ కుంద్రా వల్ల ఇబ్బందులు పడిన పలువురు నటీమణులు, యూట్యూబర్ లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.