బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి యాప్ లలో కొన్ని సైట్ లలో అప్లోడ్ చేస్తున్నాడు అనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికి తెలిసిందే. జూలై 19 వ తేదీన రాజేంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నుంచి ఇతనికి సన్నిహితంగా ఉన్న వారిని, ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉంటుంది అని అనుమానించిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆయన స్వగ్రామమైన జోహూలోను సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి ని కూడా పోలీసులు విచారించారు.