మాస్ మహారాజా రవితేజ ఈ పేరు వింటే ప్రొడ్యూసర్లకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. దానికి ప్రధాన కారణం రవితేజతో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ... పెట్టిన డబ్బులు ఎటు పోవు అని వారి నమ్మకం. ఇలా ఇంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో కొన్ని వరుస అపజయాలతో డీలా పడిపోయాడు. తనకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తుంది అని ఎంతో నమ్మకంతో తీసిన 'బెంగాల్ టైగర్' సినిమా కూడా నిరాశపరచడంతో కెరీర్లో ఎప్పుడూ లేనంతగా రెండు సంవత్సరాల విరామం తీసుకొని అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'రాజా ది గ్రేట్' సినిమాలో నటించాడు. ఈ సినిమా విజయం రవితేజకు ఎక్కడ లేనంత జోష్ ని తీసుకువచ్చింది.