ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సుస్వాగతం' సినిమా ద్వారా ఈ నటుడికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో పాత్రలు వేసిన బండ్ల గణేష్ పరుశురామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'ఆంజనేయులు' సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ సినిమా థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది . ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్,గబ్బర్ సింగ్ సినిమాలు నిర్మించాడు.