ప్రస్తుతం అకీరానందన్ కర్ర సాములో కూడా శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రేణు దేశాయ్ షేర్ చేసింది. దాంతో ఈ వీడియో అకీరానందన్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసమే అని అంతా భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చిన్న వయస్సు నుండే కరాటే నేర్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో అకీరానందన్ కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తున్నారు అని అభిమానులు చెబుతున్నారు.