ప్రస్తుతం చార్మి తీసుకున్న నిర్ణయం ఈ ముద్దుగుమ్మ అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. తాను విరామం కోసం సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ చేసింది. ఈ విషయమై చార్మి తన ట్విట్టర్ ఖాతాలో మంచి కోసం సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నాను. సి యు గాయ్స్... అంటూ ట్వీట్ చేసింది. ఈ బ్యూటీకి ట్విట్టర్ ఖాతాలో 600 కె ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ నెలలో చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయి దృష్టి పెట్టేందుకు చార్మి సోషల్ మీడియా కు గుడ్ బై చెప్పి నట్లు తెలుస్తోంది. 'లైగర్' సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ,పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మి, పూరీ జగన్నాథ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.