ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు , హిందీ భాషలలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ విలక్షణ నటుడు అయిన హరీశ్ పేరడీ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పైడర్, ఎరిడ, మెర్సల్, పులి మురుగన్, మనోహర, మడ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, విక్రమ్ వేద లాంటి సినిమాలలో హరీశ్ పేరడీ నటించాడు. ఈ సినిమాతో తాప్సి తిరిగి మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించ బోతుంది. తాప్సి కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా సినిమాలను కూడా నిర్మిస్తాను అని ఈ మధ్యనే ప్రకటించింది.