ప్రదీప్ తనకు బాలయ్యతో జరిగిన ఒక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్య మాటతీరు... ఆయన స్టైల్ ఎప్పుడూ కూడా సింహంలా ఒకే లాగా ఉంటుందని చెప్పారు.  బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గాని ఎక్కడైనా గాని సహాయం కావాలంటే ఫస్ట్ ఫోన్ కాల్ బాలయ్యకి చేస్తామని ప్రదీప్ వెల్లడించారు. అప్పటికప్పుడు కాల్ చేసి ఎంతో మందికి ఆయన ట్రీట్మెంట్ చేయించారు అని అన్నారు. అర్ధరాత్రి అయినా సరే నాకు ఫోన్ చెయ్ అని బాలయ్య తనతో అన్నారని.... ఆ ఒక్క మాట చాలని ఆయన ఇచ్చిన ధైర్యం చాలని అన్నారు. బాలయ్య గురించి చెబుతూ ప్రదీప్ ఆయన నిజస్వరూపం బయట పెట్టారు.