గాయకుడు మరియు రాపర్ యో యో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ ఇప్పటికే తన బర్త తనను వేధింపులకు గురిచేశాడంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా షాలిని ఇప్పుడు తన మామ గురించి కూడా సంచలన ఆరోపనలు చేసింది. గృహ హింస, మానసిక హింస మరియు లైంగిక హింస కు గురి చేశాడని షాలిని తన భర్త హనీ సింగ్ అలియాస్ హిర్దేశ్ సింగ్‌పై కేసు నమోదు చేసింది. ఇక ఇప్పుడు తన మామ సరబ్జిత్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఒకరోజు తాను గదిలో బట్టలు మార్చుకుంటుండగా, తన మామ తాగి గదిలోకి ప్రవేశించాడని షాలిని పేర్కొంది. అంతే కాకుండా తన చాతిని తాకి అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించింది.