టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కలిసి సినిమా చేయబోతున్నారా..? వీరి కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే వీరిద్దరూ కలిసి సినిమాలో హీరోలుగా నటించడం లేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమాను నిర్మిస్తే ఆ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ టాక్ ప్రకారం.... మహేష్ బాబు ఎస్ ఎస్ ఎంబీ 28 సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.