బాలీవుడ్ నిర్మాత ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో జైలు పాలైన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా బెయిల్ కోసం అప్లై చేసుకోగా కోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసులో భాగంగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాను కూడా విచారించారు. షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాకు సంబంధించిన యాప్ కోసం వీడియోలు చేసింది. కాగా నిన్ని క్రైం బ్రాంచ్ దాదాపు షెర్లిన్ చోప్రాను పద్దెనిమి గంటలపాటు విచారించింది. విచారణ అనంతరం షెర్లిన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయట పెట్టారు. ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుంటానని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు.