మొదట నమ్రత తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. కానీ మహేష్ బాబును చూసి మాట్లాడిన తర్వాత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ తర్వాత మహేష్ బాబు కుటుంబంలోనూ పెళ్లికి నో చెప్పారట. సూపర్ స్టార్ కృష్ణ.... నమ్రత ముంబై హీరోయిన్ కావడం, సాంప్రదాయాలు వేరనే కారణాల వల్ల నో చెప్పారట. మరోవైపు మహేశ్ అమ్మమ్మ దుర్గమ్మ పెళ్లికి అసలు ఒప్పుకోలేదట. ఈ పెళ్ళి అంటే తనకు అస్సలు ఇష్టం లేదు అని నానా హంగామా చేశారట. కానీ చివరికి మహేష్ బాబు అక్కలు మరియు బావలు కలిసి కృష్ణ ను మహేష్ అమ్మమ్మ ను ఒప్పించి పెళ్లి చేశారట. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నమ్రత ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.