బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తో పాటు శిల్పాశెట్టి తల్లికూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టికి, ఆమె తల్లి కి మరో షాక్ తగిలింది. శిల్పా శెట్టి మరియు ఆమె తల్లి పై ఉత్తరప్రదేశ్ లో ఫ్రాడ్ కేసు నమోదైంది. దాంతో లక్నో పోలీసులు శిల్పాశెట్టిని ఆమె తల్లిని విచారించేందుకు ముంబై కి వెళుతున్నారు. వెల్నెస్ సెంటర్ పేరుతో శిల్పాశెట్టి ఆమె తల్లి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో ఇద్దరిపై లక్నో లోని హజారత్ గంజ్, విభూతి ఖంద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.