మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరిపించాలని కోరారు. 'మా' ఎన్నికలు జాప్యం లేకుండా వెంటనే జరగాలన్న చిరంజీవి.. ప్రస్తుతం కొనసాగుతున్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని గుర్తు చేశారు. ఇలా ఆపద్ధర్మ కార్యవర్గం ఎక్కువ కాలం కొనసాగింపు మంచిది కాదని చిరంజీవి హితవు పలికారు.