టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు గా ఎదిగిన పలువురి ఫాలోవర్ల సంఖ్యను రష్మిక బీట్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘20 మిలియన్ల అనుభూతి ఉంది. లవ్ యూ’ అంటూ రష్మిక సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. దాంతో రష్మిక అభిమానులు...ఇండస్ట్రీకి చెందిన స్నేహితులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.