తాను గాయం నుంచి కోలుకున్నట్లు ఈ విలక్షణ నటుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తనకు సర్జరీ అయిన ఫోటోను ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ 'డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ పేర్కొన్నారు. సర్జరీ విజయవంతంగా పూర్తి అయినట్లు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు. తనకు వైద్యం చేసిన డా.గురువరెడ్డికి తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు