టాలీవూడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పేరుకి ఓ చరిత్ర ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ అని చెప్పాలి మరి.