తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవితో ఒక్క సినిమా చేయాలని తపనపడే వారు చాలా మంది ఉన్నారు. అంతేకాదు.. ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకుడు చిరంజీవి కోసం ఏళ్లు ఎదురు చూస్తున్నారు. ఇక అలా చిరంజీవితో పనిచేయాలని ఎదురుచూసిన సంగీత దర్శకుల్లో థమన్ ఒకరనే చెప్పాలి.