ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతుండటం అలానే అందరిలో కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో పాక్షికంగా లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మళ్ళీ దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవాలంటే మరికొంత సమయం పట్టేలా ఉందని.. అందుకే తమ తమ సినిమాని ఇటువంటి పరిస్థితుల్లో విడుదల చేయడం కంటే మరోసారి వచ్చే ఏడాదికి సినిమాను వాయిదా వేసే ఆలోచన చేస్తోందట ఆర్ ఆర్ ఆర్ టీమ్.