మలయాళ హిట్ లూసిఫర్ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుందని సమాచారం.ఇక మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తారని కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది. అయితే పాన్ ఇండియా అప్పీల్ కోసమే సల్మాన్ ఖాన్ ను ఈ మూవీ లో నటింపజేయలనే ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం.