ఈ మధ్య కాలంలో ఒక్క ప్రభాస్ తప్పా.. మిగతా అగ్ర హీరోలందరి సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి.కానీ ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ ని ఈ విషయంలో తెగ నిరాశపరుస్తున్నాడు.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో సినిమాల సర్ ప్రైజ్ ల కోసం ఆయన పుట్టినరోజు వరకు ఆగాల్సిందేనట.అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు.ఆ రోజు మాత్రం ఒకటి కాదు ఏకంగా మూడు సర్ ప్రైజ్ లను ఇవ్వనున్నాడట ప్రభాస్..