పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి 'భీమ్లా నాయక్' అనే టైటిల్ ని ఖరారు చేసి ఓ టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేయగా.. ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ సినిమాకి భీమ్లా నాయక్ అనే టైటిల్ ఫైనల్ కావడం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేయడం వెనుక కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది.