కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు రిలీజ్ అయిన అతి తక్కువ కాలానికే ఓటీటీలో విడుదలవుతున్నాయి. కరోనా ఫస్ట్ సమయంలోనూ ఇలానే జరిగింది. థియేటర్ లో మంచి విజయం సాధించినా కరోనా వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో సినిమాలు తక్కువ సమయంలోనే సినిమాలు ఓటీటీని నమ్ముకున్నాయి. ఇక ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన తక్కువ కాలంలోనే ఓటీటీలోకి వస్తున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 6వ తేదీన థియేటర్ లో విడుదల చేసిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా కూడా వాటిలో విడుదలవుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా ఆహాలో ఆగస్టు 27వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరగబోతుందని టాక్ వినిపిస్తోంది.