మన నాని కి ఓటీటీ అనేది పెద్దగా కలిసి రాలేదు. కరోనా టైం లో ఎన్నో అంచనాల మధ్య ఓటిటిలో విడుదలైన 'వి' సినిమా ప్లాప్ అయ్యింది. కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. ఇప్పుడు టక్ జగదీశ్ కూడా ఓటీటీ లో రిలీజ్ అంటున్నారు.దీంతో ఈ సినిమా కూడా అలాంటి ఫలితాన్నే అందుకుంటుందేమోనని నాని ఫ్యాన్స్ ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.