మన టాలీవుడ్ లో హీరోయిజన్ని ఎలివేట్ చేస్తూ తెరకెక్కిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ప్రభాస్ నటించిన 'మిర్చి'సినిమా కూడా ఒకటి.సినిమాలో ప్రభాస్ నటన, యాటిట్యూడ్,మాస్ ఎలివేషన్స్.. ఇలా అన్నింటికీ తగ్గట్లుగానే ఈ సినిమాకు మిర్చి అనే టైటిల్ పెట్టారేమోనని అనిపిస్తుంది.నిజానికి ఆ టైటిల్ మొదటగా అనుకున్నది ప్రభాస్ కోసం కాదట.ఆ టైటిల్ ను ముందు మన సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రిజిస్టర్ చేయించారట.కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ టైటిల్ మన రెబల్ స్టార్ ప్రభాస్ ని వరించింది.