ఈసారి భారీ హిట్ అందుకోవాలని ప్రేమ కథల్ని పక్కన పెట్టి ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు అఖిల్. ఆ సినిమానే 'ఏజెంట్'.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు.అయితే ఈసారి అఖిల్ సక్సెస్ మొత్తం ఈ సినిమా కధపైనే ఆధారపడి ఉందట.