తెలుగు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సుస్వాగతం' సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి పాత్రలో కనిపించిన బండ్లగణేష్ రవితేజ హీరోగా, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆంజనేయులు' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్, గబ్బర్ సింగ్ అనే రెండు సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ 'గబ్బర్ సింగ్' చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో ఆ జోష్ లోనే తెలుగు లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు.