అష్షు ఆర్జీవీతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత క్రేజ్ సంపాదించుకునేందకు సిద్దమైంది. ఇప్పటికే అష్షు ఆర్జీవీతో ఇంటర్య్వూ చేస్తున్నట్టు ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో ఆర్జీవీ అష్షు పొట్టి బట్టలు వేసుకోగా తన ఫోన్ లో ఫోటోలను తీస్తున్నట్టు ఫోజులు ఇస్తున్నాడు. ఇక ఈ వీడియో మరియు ఫోటోలపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూపై ఆర్జీవీ కూడా తనదైన స్టైల్ లో స్పందించాడు. ఆ వీడియోలో ఉంది నేను కాదు..ఆ వీడియోలో ఉంది అష్షు రెడ్డి కూడా కాదు. మేమిద్దరం కలిసి అసలు ఇంటర్వ్యూనే చేయలేదు. ఆ ఇంటర్వ్యూ పేరు అష్షు బోల్డ్ ఆర్జీవీ కానే కాదు.అది అరియానా బోల్డ్ ఆర్జీవీ..నేను అందరు దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నా...కానీ దేవతలపై కాదు. అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు.