మా ఎన్నికలపై టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాఎన్నికల్లో బండ్ల గణేష్ తన మద్దతును ప్రకాష్ రాజ్ కు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.... మా కు శాశ్వత భవనం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ మా కు శాశ్వత భవనం అనే ఎజెండాతో ముందుకు వస్తున్నారని అన్నారు. కానీ మా లో సభ్యులుగా తొమ్మిది వందల మంది వరకు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారికి సరైన ఆర్థిక స్థోమత లేక ప్రతి నెల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.