దేవి సినిమాతో తెలుగు ఇండ్రస్టీ కి హీరోయిన్ గా అడుగుపెట్టింది వనితా విజయ్ కుమార్. మొదటి సినిమాతో మంచి నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు.కానీ తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్ గామంచి పేరును సంపాదించుకుంది.ఇక తాజాగా ఈమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.