టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10న ఓటీటీ రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.కానీ అదే సమయంలో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన `లవ్ స్టోరి` సినిమా కూడా థియేటర్లో విడుదల చేయనున్నారట.అయితే ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని,థియేటర్ కోసం ఓ సినిమా, ఓటీటీ కోసం మరో సినిమా పోటీ పడుతుండటంతో థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు ఎగ్జిబిటర్లు.